Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణికులపై రైల్వేశాఖ పెనుభారం, సామాన్యులకు చార్జీల మోత

Advertiesment
ప్రయాణికులపై రైల్వేశాఖ పెనుభారం, సామాన్యులకు చార్జీల మోత
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (22:15 IST)
కరోనా మహమ్మారి సామాన్యుల జీవనోపాధిని పతనం చేసింది. లాక్ డౌన్‌తో జీవనోపాధి కోల్పోయిన సామాన్యులపై రైల్వేశాఖ మరింత భారం మోపనుంది. ఇప్పటికే టికెట్, ప్లాట్ఫాం టికెట్ చార్జీలను పెంచేసింది. తాజాగా ప్రయాణికులపై యూజర్ చార్జీలను మోపడానికి రంగం సిద్దం చేసింది రైల్వేశాఖ. ఈ మేరకు కేంద్ర సర్కారు వేగంగా అడుగులు వేసింది.
 
మరోవైపు ప్రైవేటీకరణలో భాగంగా పలు రూట్లను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసింది కేంద్రం. దీంతో రైల్వే చార్జీలు సామాన్యులకు మోయలేని పెను భారంగా మారనున్నాయి. రైల్వేశాఖ ప్రతిపాదనలు ప్రకారం యూజర్ చార్జీలను సుమారు 50 రూపాయలు వరకు పెంచవచ్చని సమాచారం. దీనిపై ట్రాఫిక్ డైరెక్టరేట్ తుది కసరత్తు చేస్తున్నది. ముందుగా అభివృద్ధి చేసిన 50 స్టేషన్లలో యూజర్ చార్జీలను అమలు చేయనున్నట్లు రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.
 
రైల్వేస్టేషన్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలంటే వసూలు చేయక తప్పదని ఆయన అన్నారు. మరోవైపు ప్రైవేట్ రూట్లలో నడిచే రైళ్లలో టికెట్ ధరలను నిర్ణయించే అధికారం కూడా ప్రైవేట్ యాజమాన్యాలకే అప్పజెప్పేందుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల నిర్ణయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నది సర్కార్ ఆలోచనగా వున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త మొబైల్, ల్యాప్‌టాప్‌లలో మహిళల అశ్లీల వీడియోలు, భార్య షాక్..?