Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్‌కి కరోనాపాజిటివ్ వ్యక్తులు, ఎయిర్ ఇండియా విమానాలపై దుబాయ్ ప్రభుత్వం నిషేధం

దుబాయ్‌కి కరోనాపాజిటివ్ వ్యక్తులు, ఎయిర్ ఇండియా విమానాలపై దుబాయ్ ప్రభుత్వం నిషేధం
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:20 IST)
భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలపై దుబాయ్ ప్రభుత్వం 15 రోజులపాటు నిషేధం విధించింది. గత రెండు వారాల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ ఉన్న ప్రయాణికులను రెండుసార్లు తీసుకువచ్చినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటి అధికారులు ఎయిర్ ఇండియా సర్వీసులను అక్టోబరు 2 వరకు నిలిపివేసినట్లు శుక్రవారం వెల్లడించారు.
 
యుఏఈ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులందరూ 96 గంటలు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలో నెగటివ్‌గా నిర్థారణ అయినట్లు ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటేనే దుబాయ్ రావడానికి అనుమతి ఉంటుంది. అయితే ఈ నెల 4న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జైపూర్ దుబాయ్ విమానంలో ప్రయాణించిన వ్యక్తి వద్ద సెప్టెంబరు 2వ తేదీతో కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్ ఉందని అధికారులు తెలిపారు.
 
ఇంతకుముందు వారం కూడా ఇలాంటి సంఘటన జరిగిందని ఈ మేరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 2 వరకు నిలిపివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష ఇండ్లు ఎక్కడ?.. కేసీఆర్ మోసాలకు బలికావద్దు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క