Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. స్వస్థలానికి వెళ్ళేందుకు రైలు ఎక్కిస్తామని.. బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (09:26 IST)
మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. నిర్భయ లాంటి చట్టాలు వచ్చిన మహిళలపై ఆగడాలు తగ్గట్లేదు. ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్న 16 ఏళ్ల అమ్మాయిని స్వస్థలమైన జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామంటూ మాయమాటలు చెప్పిన ముగ్గురు యువకులు ఆమెను తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్న 16 ఏళ్ల అమ్మాయి తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్ వెళ్లేందుకు ఆనంద్ విహార్ రైల్వేస్టేషనుకు వచ్చింది. అక్కడి నుంచి న్యూఢిల్లీ రైల్వేస్టేషనుకు చేరుకుంది. జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామని మాయమాటలు చెప్పి బాలికను ముగ్గురు యువకులు తీసుకువెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. 
 
అనంతరం బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత బాలికను రోడ్డుపై వదిలేశారు. బాలిక అనుమానాస్పదంగా మత్తులో జోగుతూ నడుస్తుండగా ఓ పోలీసు కానిస్టేబుల్ గమనించి ఆమెను పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారు. 
 
మహిళాపోలీసులు ప్రశ్నించగా బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలిసింది. దీంతో బాలికకు వైద్యపరీక్షలు చేయించి ఆమెను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments