ప్రేమ పేరుతో ఓ యువతిని లెక్చరర్ ఒకరు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానన నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆ యువతి ప్రేమికుడి మోసాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని నల్లాటూరుకు చెందిన మణి కుమార్తె మణిమేగలై (21) తాళవేడుకు చెందిన మునిరత్నం కుమారుడు రాజ్‌కుమార్ (26)నాలుగేళ్లుగా ప్రేమించు కుంటున్నారు.
వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ యువతి కూడా తొందరపడింది. ఈ క్రమంలో యువతిని శారీరకంగా వాడుకున్న రాజ్‌కుమార్.. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా, అందుకు నిరాకరించాడు.
దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంచుకొని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటనపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదుచేసి రాజ్‌కుమార్‌కు విచారిస్తున్నారు. రాజ్‌కుమార్ ఓ ప్రైవేటు విద్యాసంస్థలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది.