Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీక్ స్టేజ్‌కు కరోనా.. ఏం చేద్ధామంటూ అఖిలపక్షానికి కేంద్రం పిలుపు

Advertiesment
పీక్ స్టేజ్‌కు కరోనా.. ఏం చేద్ధామంటూ అఖిలపక్షానికి కేంద్రం పిలుపు
, ఆదివారం, 14 జూన్ 2020 (19:33 IST)
దేశంలో కరోనా విశ్వరూపం దాల్చడం ఖాయమని తేలిపోయింది. గత కొద్ది రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయాన్ని గ్రహించవచ్చు. ముఖ్యంగా, ఢిల్లీ వంటి నగరాల్లో కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో కరోనా రోగుల కోసం రైల్వేబోగీలను కేటాయించనున్నారు. తద్వారా ఐదు నుంచి ఎనిమిదివేల బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో కేంద్రం మరోమారు అప్రమత్తమైంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోమవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా ధృవీకరించింది.
 
'కరోనా కట్టడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. సమావేశానికి రావాలంటూ కేంద్ర హోంశాఖ నుంచి మెసేజ్ కూడా వచ్చింది' అని ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ చౌదరి ప్రకటించారు. 
 
కాగా, కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని, ఈ క్రమంలో ఎంతటి కఠినమైన చర్యలనైనా తీసుకునేందుకు వెనుకాడవద్దని కేంద్రం భావిస్తోంది. అవసరమైతే పరిమితి ప్రాంతాల్లో... లాక్డౌన్ విధించాలని కూడా యోచిస్తోంది. ఈ క్రమంలో సోమవారం జరగనున్న భేటీలో పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 
 
త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ 
మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు 3 లక్షలు దాటిన తరణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చల్లటి కబురు చెప్పారు. కరోనా సంక్షోభం ఎంతోకాలం ఉండదని, త్వరలోనే దీనికి తెరపడుతుందని అన్నారు. 
 
త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. భారత్‌తో పాటు ఇతర దేశాల శాస్త్రవేత్తలు రేయింబవళ్లూ వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు కష్టపడుతున్నారని చెప్పారు.
 
'కరోనా సంక్షోభం ఎప్పటికీ ఇలాగే ఉండిపోదు. వ్యాక్సిన్ డవలప్‌ చేసేందుకు దేశవిదేశాల శాస్త్రవేత్తలు అహరహం కష్టిస్తున్నాను. త్వరలోనే మనకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కచ్చితంగా చెప్పగలను' అని గడ్కరి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో కరోనా విశ్వరూపం.. దేశంలో నవంబరు నాటికి పీక్ స్టేజ్