Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్సిల్‌పై అద్భుతం.. పెన్సిల్ మొనపై శివుని రూపం.. 1008 కిలోలతో బూందీతో శివలింగం

సెల్వి
మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (22:18 IST)
Lord Shiva
పెన్సిల్‌పై అద్భుతమైన కళాఖండాలు రూపొందిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.. ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చిన్న దొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్. ఇతను అమెరికాలో వుంటున్నాడు. సందర్భానుసారం సూక్ష్మ కళారూపాలు చేయడం ఆతని హాబీ. 
 
తాజాగా 18 మిల్లీ మీటర్ల ఎత్తు, 8 మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ మైక్రో ఆర్ట్ చేశాడు వెంకటేష్. పది గంటల పాటు శ్రమించి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించానని అంటున్నాడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెన్సిల్ మొనపై అతి సూక్ష్మంగా శివుడి కళా రూపం చెక్కి ఔరా అనిపించాడు.
 
తలపై సగం మిగిలిన నెలవంక, మేడలో హారంగా విష సర్పం, చేతిలో త్రిశూలం.. కాలి కింద పులి చర్మం.. ఒంటి కాలుపై శివతాండవం చేస్తున్నట్టు మహాశివుడు నాట్య రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ శిల్పం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అలాగే మహా శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పేరేచర్ల కైలాసగిరి క్షేత్రం ఉత్సవ కమిటీ 1008 కిలోలతో శివలింగాన్ని తయారు చేశారు. అయితే దీనిని లడ్డూ బూందీతో తయారుచేయడం దీని స్పెషల్.

5 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుతో దీనిని రూపొందించినట్లు తెనాలి మిర్చి స్నాక్స్‌ నిర్వాహకులు తెలిపారు. తెనాలి పట్టణం చెంచుపేటలోని వ్యాపార కేంద్రం వద్ద దీన్ని ప్రదర్శించడంతో ప్రజలంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

తర్వాతి కథనం
Show comments