Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. ఎంతో కష్టపడ్డాను : ఐశ్వర్య రాజేష్

Advertiesment
aishwarya rajesh

ఠాగూర్

, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (15:09 IST)
తాను గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఆ సమయంలో ఎన్నో కష్టాలు అనుభవించినట్టు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అన్నారు. హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించిన తాజా చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం". ఇందులో వెంకటేష్ భార్యగా నటించిన ఐశ్వర్య.. నటనలో అదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. 
 
ప్రేమ కంటే అది బ్రేక్ అయినపుడు వచ్చే బాధ తనకెంతో భయమన్నారు. గతంలో తాను రిలేషన్‌షిప్‍‌లో ఉన్నానని, సినిమాల్లో అడుగుపెట్టిన కొత్తల్లో ఒక వ్యక్తిని ఇష్టపడ్డానని తెలిపారు. అతడి నుంచి వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. రిలేషన్‌షిప్‌‍లో ఇలా ఎందుకు జరుగుతుందని భయపడ్డానని తెలిపారు. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఎంతగానో ఆలోచన చేస్తున్నానని తెలిపారు. 
 
ఇకపోతే, ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడే భాగ్యం కోసం అనిల్ రావిపూడి నా పేరు చెప్పినపుడు, తనైతే చాలా ఈజీగా చేస్తుంది అంటూ వెంకటేష్ చాలా సపోర్టు చేశారట. ఇంత కామెడీ ఉన్న రోల్ చేయడం నా సినీ కెరియర్‌లో ఇదే తొలిసారి. మహేశ్ బాబు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించి 'ఏవయ్యా అనీలూ ఈ పిల్లని ఎక్కడ పట్టావ్' అని అన్నారు. జీవితంలో ఇంతవరకూ రావడానికి మా అమ్మే కారణం అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరిహర వీరమల్లు తాజాఅప్ డేట్ - రాయల్ లుక్ లో నిధి అగర్వాల్