Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ

Advertiesment
Victory Venkatesh, Anil Ravipudi, Raghavendra Rao

దేవి

, మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (12:14 IST)
Victory Venkatesh, Anil Ravipudi, Raghavendra Rao
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, అత్యధిక వసూళ్ళు సాధించిన మొదటి తెలుగు రిజినల్ చిత్రంగా చరిత్ర సృష్టించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ విక్టరీ వేడుకని నిర్వహించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ వేడుకుకు అతిధిగా హాజరయ్యారు. డైరెక్టర్ హరీష్ శంకర్, వశిష్ట, వంశీపైడిపల్లి స్పెషల్ గెస్ట్ లు గా హాజరయ్యారు. ఈ వేడుకలో నిర్మాతలు చిత్ర యూనిట్ తో పాటు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి షీల్డ్స్ అందించారు.
 
విక్టరీ వేడుకలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ,  ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'ని సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా వుంది. ఓ మంచి దేవుడా.. నేను అడగకుండానే కలియుగ పాండవులు సినిమా ఇచ్చావు. నేను అడగకుండానే చాలా హిట్లు ఇచ్చావు. చంటి లాంటి సినిమా ఇచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ చేశావు(నవ్వుతూ) ప్రేమించుకుందాం రా, బొబ్బిలిరాజా, సీతమ్మవాకిట్లో, గణేష్, లక్ష్మీ,తులసి, రాజా ఇలా ఎన్నో ఇచ్చావు. 2000 లో మళ్ళీ ఒక ఇండస్ట్రీ హిట్ కలిసుందాంరా ఇచ్చావ్. 2025లో ఏం ఆడకుండా సైలెంట్ గా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చావు. ఇది కలా నిజమా తెలియడం లేదు. అభిమానులు ప్రేక్షకులు ఇండస్ట్రీలో వున్నవారంతా కోరుకోవడం వలనే ఇది సాధ్యపడిందని భావిస్తున్నాను. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన అందరికీ థాంక్ యూ. ఈ సినిమా బిగినింగ్ నుంచి చాల ఎంజాయ్ చేశాను. మా గురువు గారు రాఘవేంద్రరావు మంచి ఫ్యామిలీ ఫిల్మ్ చేయ్ పెద్ద హిట్ అవుతుందని చెప్పేవారు. ఆయన నమ్మకం నిజమైయింది. నా ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చాలా గొప్పగా ఆదరించారు. మీ ప్రేమ అభిమానం ఎప్పుడూ కావాలి. పదేళ్ళుగా సినిమా చూడని ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అనిల్ అద్భుతమైన పనితీరు కనబరిచాడు, 2027లో మళ్ళీ సంక్రాంతికి వస్తాం. రికార్డులు కాదు.. మంచి ఎంటర్ టైన్మెంట్ ఫిలిమ్స్ తో ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చూడటం నాకు ఇష్టం. అందరికీ థాంక్ యూ' అన్నారు.
 
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..ఈ సినిమాని వెంకటేష్ క్యారెక్టర్ లో వుండి చూశాను. హీరోయిన్స్ కోసం ఎక్కువ ఎంజాయ్ చేశాను(నవ్వుతూ). భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇది వెంకటేష్ విక్టరీ. దిల్ రాజు అనిల్ కాంబినేషన్ అన్ని హిట్స్. ఏ ఫర్ అనిల్. ఈ సినిమాతో అంతులేని ఆనందం ఇచ్చే అనిల్ అయ్యాడు. అనిల్ ఇలాంటి వినోదాత్మక సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పృథ్వీరాజ్‌ లైలా ప్రమోషన్ లో డైలాగ్స్ అన్నాడా, అనిపించారా?