Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి - అనిల్ కాంబోలో మెగా చిత్రం... టైటిల్ చెప్పిన దర్శకేంద్రుడు - ఆ పేరు ఇదే...

Advertiesment
K.Raghavendra Rao

ఠాగూర్

, మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (10:57 IST)
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని అధికారికంగా దర్శక, హీరోలు ప్రకటించారు. మార్చి లేదా మే నెలలో సెట్స్‌‍పైకి తీసుకెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఓ టైటిల్‌ను సూచించారు. 
 
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో టీమ్ విక్టరీ వేడుకలను తాజాగా హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. ఇందులో దర్శకుడు కే రాఘవేంద్ర రావు, హరీశ్ శంకర్, వంశీపైడిపల్లి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యరారు. 
 
ఈ సందర్భంగా చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్‌ను పెడితే బాగుటుందని రాఘవేంద్ర రావు వేదికపై నుంచి చెప్పారు. ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా, సంక్రాంతి సీజన్‌ను వదిలిపెట్టవద్దని దర్శకుడు అనిల్ రావిపూడికి సూచించారు. 
 
చిరంజీవితో అనిల్ రూపొందించే చిత్రానికి "సంక్రాంతి అల్లుడు" అయితే బాగుంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి తెచ్చింది. ఎక్కువ  థియేటర్లలో ఎక్కువ షోలు సినిమా ప్రదర్శతమవడం చాలా రోజుల తర్వాత చూస్తున్నా. ఈ చిత్రంలో హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిల నటన చాలా బాగుంది. బయట సైలెంట్‌గా ఉండే వెంకటేష్.. వెండితెరపై మాత్రం ఇద్దరు హీరోయిన్లను  ఆడుకున్నారు. పైగా, భీమ్స్ సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఇపుడు అనిల్ - చిరు కాంబోలో వ్చే చిత్రానికి కూడా భీమ్స్ సంగీతం అందిస్తారని అనిల్ తనతో చెప్పారని రాఘవేంద్ర రావు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)