Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

Advertiesment
allu arvind

ఠాగూర్

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (18:25 IST)
హీరో రామ్ చరణ్ తనకు కొడుకు లాంటివాడని, తనకున్న ఏకైక మేనల్లుడు అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, ఓ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్థాయిని తగ్గించేలా మాట్లాడినట్టుగా మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారని, చెర్రీని తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ అనలేదని స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పరిస్థితిని వివరించే క్రమంలో తాను మాట్లాడిన మాటలు మరోలా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. 
 
ఆ రోజున చేసిన చేసిన వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా చేసినవికావు. దానికి మెగా అభిమానులు చాలా ఫీలయ్యారు. నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నాకు కొడుకులాంటివాడు. నాకున్న ఏకైన మేనల్లుడు. అతడికున్న ఏకైక మేనమామని, అందుకే ఎంతో భావోద్వేగంతో చెబుతున్నాను. ప్లీజ్.. ఇక ఆ విషయం వదిలివేయండి. చరణ్, నాకు మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఆ రోజున దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికి పొరపాటున అలా మాట్లాడాల్సివచ్చింది. తర్వాత అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనిపించింది అని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. 
 
మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య
 
హీరోయిన్ సమంతతో విడాకుల అంశంపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సమంతతో విడాకుల అంశం జనాలతో పాటు మీడియాకు ఒక ఎంటర్‌టైన్మెంట్ అంశంగా మారింపోయిందంటూ కామెంట్స్ చేశారు. మేమిద్దరం కలిసే విడాకులు తీసుకున్నామని, వ్యక్తిగతంగా, ఏకపక్షంగా విడాకులు తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు. 
 
నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'తండేల్'. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అర్జున్ సమర్పణలో, బన్నీవాసు నిర్మించారు. ఈ నెల 7వ తేదీన విడుదలై, సూపర్ హిట్ టాక్‌తో దూసుకునిపోతుంది. వాణిజ్యపరంగా కూడా భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఈ చిత్రం సక్సెస్ టూర్‌లో భాగంగా, నాగ చైతన్య మీడియాతో మాట్లాడారు. 
 
మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎంటర్‌టైన్మెంట్‌గా మారిందన్నారు. మేము ఇద్దరం కలిసే విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రిలేషన్‌షిప్ బ్రేక్ చేసే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించామని చెప్పారు. తానుకూడా ఒక బ్రోకేన్ ఫ్యామిలీ నుంచే వచ్చినట్టు చెప్పారు. విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసున్నారు. నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద మీ లైఫ్‌పై మీద పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)