Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన హరర్, థ్రిలర్, లవ్ సినిమా గార్డ్

Advertiesment
Viraj Reddy Cheelam, Mimi Leonard, Shilpa Balakrishna

దేవి

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (15:28 IST)
Viraj Reddy Cheelam, Mimi Leonard, Shilpa Balakrishna
విరాజ్ రెడ్డి చీలం హీరోగా జగ పెద్ది దర్శకత్వంలో అను ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనసూయ రెడ్డి నిర్మించిన చిత్రం ‘గార్డ్’.  రివేంజ్ ఫర్ లవ్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయబోతోన్నారు. సినిమా మొత్తాన్ని ఆస్ట్రేలియాలో షూట్ చేయడం విశేషం. హారర్, థ్రిలర్, లవ్ ఎలిమెంట్స్‌తో రాబోతోన్న ఈ చిత్రంలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.  
 
ఈ మేరకు విరాజ్ రెడ్డి చీలం మాట్లాడుతూ.. ‘గార్డ్ మూవీ కోసం ఇలా మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చాను. గార్డ్ కోసం చాలా కష్టపడ్డాం. మీడియా సపోర్ట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఏదైనా సాధించగలం. మా టీంను మీడియా సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను. మా టీజర్ నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. మా డైరెక్టర్, టీం ఆస్ట్రేలియాలో ఉంది. రాజేష్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. అవుట్ పుట్ బాగా ఇచ్చాడు. సౌండ్ డిజైనింగ్, మిక్సింగ్ చేసిన బీనా గారు లేడీ బాస్ టైపులో ఉంటారు. పార్థు పోస్టర్లను చక్కడా డిజైన్ చేశారు.సందీప గారు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రణయ్ మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి లవ్ సాంగ్స్ ఇచ్చారు. సిద్దార్థ్ బీజీఎం గురించి అందరూ మాట్లాడుకుంటారు. జగ పెద్ది మా సినిమాకు దర్శకుడు. ఆయన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో ఏ ఒక్కరూ కొత్త యాక్టర్ అన్న ఫీలింగ్ రాదు. మిమి లియోనార్డ్, శిల్పా ఇలా అందరూ అద్భుతంగా నటించారు. అందరి సపోర్ట్ వల్లే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాను. చిన్న చిత్రాలను అందరూ సపోర్ట్ చేయండి’ అని కోరారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్ మాట్లాడుతూ.. ‘గార్డ్ పాటలు అద్భుతంగా ఉంటాయి. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మ్యూజిక్ బాగుంటుంది. సాంగ్స్, ఆర్ఆర్ అందరినీ మెప్పిస్తుంది. ఆడియో, సౌండ్ మిక్సింగ్ కూడా మా స్టూడియోలోనే జరిగింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన అనసూయ మేడంకు థాంక్స్. విరాజ్‌లో నటన పట్ల చాలా ప్యాషన్ ఉంది. సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
 
నేపథ్య సంగీత దర్శకుడు సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘గార్డ్ చిత్రానికి నేను ఆర్ఆర్ ఇచ్చాను. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలకు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. విరాజ్‌కు అన్ని క్రాఫ్ట్‌ల మీద నాలెడ్జ్ ఉంది. జగా ఈ మూవీని ఎంతో చక్కగా తీశారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. సినిమా అంతా కూడా ఆస్ట్రేలియాలో జరిగింది. ప్రణయ్ పాటలు బాగుంటాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 28న ఈ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Dhanush: ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంతా కోపమా