Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఫోన్ 3 పేరుతో టచ్ ఫోన్.. రిలయన్స్ దృష్టి

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:35 IST)
భారత టెలికాం రంగంలో 2016లో వచ్చిన జియో భారీ మార్పులను తీసుకొచ్చింది. మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని మాసాలకే ప్రముఖ సంస్థలతో పోటీ పడుతూ వినియోగదారుల చేరికలో ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్‌ను నెలకొల్పింది. అలాగే జియో ఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
 
సామాన్యులకు అందుబాటులో ఉండే ధరతో మొబైల్ సేవలను మరింత దగ్గర చేసింది. ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో క్వెర్టీ మోడల్‌ని కూడా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫీచర్లతో అందుబాటు ధరలో ఉండేలా స్మార్ట్‌ఫోన్‌ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మరికొన్ని నెలల్లో రిలయన్స్ వార్షిక సమావేశం జరగనుండగా జియోఫోన్ 3 ఆవిష్కరణపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
 
5 అంగుళాల టచ్ స్క్రీన్‌తో పాటు పవర్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ సాయంతో జియో ఫోన్ 3 చాలా స్మార్ట్‌గా ఆవిష్కృతం కానుంది. ఆండ్రాయిడ్ గో ఆధారంగా పని చేస్తూ, 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనున్నట్లు అంచనా. 
 
అంతేకాకుండా 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్లు తెలుస్తోంది. ఇక జియో ఫోన్ ధర రూ.4,500కు ఉండవచ్చని అంచనా. ఈ యేడాది జూన్‌లో జరుగనున్న రిలయన్స్ జియో వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments