Webdunia - Bharat's app for daily news and videos

Install App

విత్తమంత్రి యనమలగారి తడబాట్లు... సవాళ్లు కాస్త.. శవాలు అయిపోయాయి...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:31 IST)
ప్రతిపక్షాల వ్యంగ్యాస్త్రాల భయమో లేక ఓటరు మహాశయులని మభ్య పెడుతున్నామన్న తడబాటో కానీ... ఆర్థిక శాఖ మంత్రివర్యులు తమ బడ్జెట్ ప్రసంగంలో చాలాసార్లు తడబడ్డారు...
 
వివరాలలోకి వెళ్తే... మంగళవారంనాడు బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన ప్రసంగంలో పలుమార్లు తడబడటం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. అయితే అందులోనే అనేక పదాలను తప్పుగా ఉచ్ఛరించడమూ జరిగింది. దాదాపు 25 పదాలను తప్పుగా ఉచ్ఛరించిన ఆయన సవాళ్లను.. శవాలుగానూ, యువతను యవతగా, కేటాయింపుల్ని కేటింపుగా, చర్చీల నిర్మాణాన్ని చర్చల నిర్మాణాలుగా, ప్రమాదాన్ని ప్రధమంగానూ చదవడం జరిగింది. 
 
చక్కటి జీవనాన్ని.. చీకటి జీవనం అని సంభోదించారు. చివరకు ఆయన రోజూ ఉచ్ఛరించే దారిద్య్ర రేఖ, ప్రోత్సాహకాలు, కేంద్రీకృతం వంటి పదాలను సైతం తప్పుగా పలికారు. ఒక దశలో అయితే ఈ చర్య అనడానికి బదులు ఈ చర్మ అనేశారు కూడా. హాలిడేను హోలీడేగా, షీ టీమ్‌ను టీ టీమ్‌గా, వ్యవసాయాన్ని వ్యవస్థాగతంగా మార్చేసిన ఆయన కొన్నిసార్లు చదివిన లైన్లనే మళ్లీ చదవడం కూడా జరిగింది. 
 
కింది లైన్లను పైన, పై వాటిని కింద చదివి మొత్తానికి కలగాపులగం చేశారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించిన యనమల ఆదిలోనే హంసపాదు అన్నట్లు పిల్లల బట్టల కుట్టుకూలిని.. కట్టుకూలి అంటూ తడబడి ఆ తడబాటు పరంపరని చివరి వరకు అలాగే కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments