Publish Date: Tue, 05 Feb 2019 (11:01 IST)
Updated Date: Tue, 05 Feb 2019 (11:06 IST)
సెర్చింజన్‌గా గూగుల్‌కు వున్న పేరు అంతా ఇంతా కాదు. స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి.. గూగుల్ తెగ ఉపయోగపడుతోంది. నెటిజన్లకు గూగుల్ లేనిదే పొద్దుగడవట్లేదు. తాజాగా గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసిన అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది. రోజూ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఎక్కువగా టైప్ చేస్తున్న పదాలుగా హౌ ఆర్ యు, ఐ లవ్ యు, థ్యాంకూ.. వంటివే నిలిచాయి.
యూజర్లు ఎక్కువగా ఈ వాక్యాలనే గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అనువదిస్తున్నారట. రోజూ సుమారు 100 బిలియన్ అంటే 10 వేల కోట్ల పదాలను గూగుల్ ట్రాన్స్‌లేట్ చేస్తోందని గూగులే స్వయంగా ప్రకటించింది. #GoogleTranslate పేరుతో ఓ యాడ్ క్రియేట్ చేసి రిలీజ్ చేసిన గూగుల్ రోజూ 10 వేల కోట్ల పదాలను ట్రాన్స్‌లేట్ చేస్తోంది.
ఇందులో భాగంగా 100 బిలియన్ వర్డ్స్ పేరుతో యూట్యూబ్, ట్విట్టర్‌లో ఈ యాడ్ పోస్టు చేసింది గూగుల్. ఈ క్రమంలో గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఎక్కువగా How are you?, I love you, Thank you అనే పదాలనే ఎక్కువగా టైప్ చేస్తున్నారట. ఇంకేముంది.. 100 బిలియన్స్ వర్డ్స్‌ను గూగుల్ ఎలా ట్రాన్స్‌లేట్ చేసిందో ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి.
webdunia
Publish Date: Tue, 05 Feb 2019 (11:01 IST)
Updated Date: Tue, 05 Feb 2019 (11:06 IST)