గర్ల్ ఫ్రెండ్‌తో చేసిన వాట్సప్ చాటింగ్‌లన్నీ పుస్తకంగా అచ్చు వేయించి..

గురువారం, 31 జనవరి 2019 (12:55 IST)
ప్రేమలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంతో ఊహలలో విహరిస్తుంటారు. ఎలాగైనా సరే తమ ప్రియమైన వ్యక్తులను ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తుంటారు. కొత్త కొత్త బహుమతులు, సర్‌ప్రైజ్‌లతో తమ ప్రేమను చాటుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా అబ్బాయిలు తన ప్రేయసిని మెప్పించడానికి కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 
 
అయితే ఈ ప్రేమికుడికి వచ్చిన ఐడియా మాత్రం వాటన్నింటినీ తలదన్నే విధంగా ఉంది. అతను ఇచ్చిన బహుమతికి ఆశ్చర్యంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అతడు చేసిన పనేంటంటే తన గర్ల్ ఫ్రెండ్‌తో ఉన్న వాట్సప్ చాటింగ్‌లన్నింటినీ ప్రింట్ వేయించాడు. ఆ తర్వాత దాన్ని పుస్తకంగా కూర్చి తన ప్రియురాలికి బహుమతిగా అందించాడు. 
 
ఈ స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో అసలు చాటింగ్ మొత్తాన్ని భద్రపరచడమే పెద్ద షాక్ అయితే దాన్ని ఏకంగా పుస్తకంగా అచ్చు వేయించడమంటే మాటలు కాదుగా మరి. ప్రేమలో ఉంటే ఇలాంటి సృజనాత్మక ఆలోచనలకు కొదవే ఉండదు మరి!!!

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మిరియాలు శక్తి మీకు తెలిస్తే వాటిని వదిలిపెట్టరు...