మొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటై వివో కంపెనీ మరో సరికొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వై91 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి జియో కంపెనీ బంపర్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. రూ.4 వేల విలువ చేసే 3 టీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది.
భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి తాజాగా విడుదల చేసిన ఈ ఫోన్ వివరాలను పరిశీలిస్తే, వై సిరీస్‌లో వచ్చిన మిడ్‌రేంజ్ ఫోన్ ఇదే కావడంగమనార్హం. ఇక ఈ ఫోన్‌లో 6.2 అంగుళాల భారీ డిస్‌ప్లేతో పాటు ఫోను వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ముందుభాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. దీనికి ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0 వంటి మరెన్నో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఫోను వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటుచేయగా, డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్లను అందిస్తున్నారు. 4030 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఈ ఫోనులో అమర్చారు. ఈ ఫోన్లు రెండు రకాల రంగుల్లో లభ్యంకానుంది. ఈ ఫోను ధర రూ.10990గా నిర్ణయించారు.
ఈ ఫోనుపై పలు ఆఫర్లను ప్రకటించాయి. జియో రూ.4 వేల విలువైన 3 టీబీ డేటాను ఉచితంగా అందిస్తుంటే, ఎయిర్‌టెల్ రూ.2 వేల విలువైన 240 జీబీ డేటాను ఇస్తుంది. ఈ ఫోనుపై నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.