Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్.. యుద్ధం వస్తే విజయం మాదే : బిపిన్ రావత్

Advertiesment
పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్.. యుద్ధం వస్తే విజయం మాదే : బిపిన్ రావత్
, బుధవారం, 16 జనవరి 2019 (13:08 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. యుద్ధమంటూ జరిగితే విజయం మాదేనని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చాక బ్రిటిష్ చేతిలో నుంచి ఆర్మీ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చిన రోజు 1949 జనవరి 15వ తేదీ. ఆ రోజున ఇండియన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఫీల్డ్ మార్షల్ ఎం. కరియప్ప బాధ్యతలను తీసుకున్నారు. ఆ రోజును భారత ఆర్మీ డేగా జరుపుకుంటున్నాం. 
 
ఈ వేడుకల్లో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పాల్గొని మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించడం మానకపోతే తాము కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం వస్తే భారత్ తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పారు. దేశ రక్షణ దృష్ట్యా ఎంతటి ప్రమాదకర పరిస్థితులనైనా ఎదుర్కోగలిగేలా బలగాలు ఎదగాలని సూచించారు. 
 
పాకిస్థాన్ పదే పదే సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడుతోందని, వాటిని భారత్ సమర్థంగా తిప్పికొడుతోందని అన్నారు. అయితే ఈ ప్రయత్నంలో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. మన శత్రువు ఉగ్రవాదులను ప్రోత్సహించడం ఆపడం లేదని, వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయుధాలు కూడా చేతికిచ్చి భారత్‌పైకి ఉసిగొల్పుతోందని జనరల్ రావత్ అన్నారు. దీనిపై భారీ రియాక్షన్‌కు కూడా భారత్ వెనుకాడబోదని బిపిన్ రావత్ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుషుని వేషంలో అయ్యప్ప దర్శనానికి మహిళలు...