ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది... ఢిల్లీ జట్టు ఫిజియోకు కరోనా సోకింది... (video)

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (11:54 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేశారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది. అయితే, ఈ టోర్నీ కోసం యూఏఈ గడ్డపై అడుగుపెట్టిన ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, అధికారులను కరోనా వెంటాడుతోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన 13 మంది ఆటగాళ్లు మహమ్మారి బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. 
 
అలాగే, భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మెడికల్‌ కమిషన్‌ సభ్యుడు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్ పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాడు. దుబాయికు వెళ్లిన అనంతరం రెండు సార్లు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. అపుడు నెగెటివ్ అని వచ్చింది. మూడోసారి మళ్లీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా అని తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. 
 
అయితే, అసిస్టెంట్ ఫిజియో ఆటగాళ్లు, సిబ్బందితో కలువలేదని, ఒంటరిగా ఉంటున్నాడు. ప్రస్తుతం దుబాయిలోని ఐపీఎల్‌ ఐసోలేషన్‌ ఫెసిలిటీలో 14 రోజులు ఉన్నాడన్నాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో చేరడానికి రెండు పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టులు రావాల్సి ఉంటుంది. కాగా, ఫిజియోథెరపిస్ట్ పేరును ఐపీఎల్‌ బృందం చెప్పలేదు. కాగా, ఐపీఎల్‌ కోసం వెళ్లి కరోనా మహమ్మారి బారినపడ్డ వారి సంఖ్య 15కు చేరింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments