Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ ఓపెన్.. జకోవిచ్ అవుట్.. కారణం కోపం.. కోపంతో కొట్టిన బంతి..?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (10:58 IST)
Novak Djokovic
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ అర్థాంతరంగా నిష్క్రమించాడు. దీంతో ఆయన 29 వరుస విజయాలు, 18వ గ్రాండ్‌ స్లామ్‌ ఆశలకు బ్రేక్‌ పడినట్లయింది. ఇందుకు కారణం ఏంటంటే.. నోవాక్ జకోవిచ్ కోపంతో విసిరిన బంతే. కోర్టులో ఆటగాడు కావాలని ప్రమాదకరంగా బంతిని విసరడం ఆట నిబంధనలకు విరుద్ధం. నియమ నిబంధనలకు విరుద్ధంగా నోవాక్ జకోవిచ్ ఈ విధంగా ప్రవర్తించడంపై యూఎస్‌ టెన్నిస్‌ అసోసియేషన్ తీవ్రంగా మండిపడుతోంది. 
 
కాగా.. కోపంతో జకోవిచ్‌ వెనక్కి విసిరిన ఓ బంతి అక్కడే ఉన్న లైన్‌ అంపైర్‌కు బలంగా తగలడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. గొంతు సమీపంలో తగలడంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టోర్నీ రెఫరీ సోరెన్‌ ఫ్రీమెల్‌, గ్రాండ్‌ స్లామ్‌ సూపర్‌వైజర్‌ ఆండ్రియాస్‌ ఎగ్లీ.. జకోవిచ్‌తో 10 నిమిషాల పాటు మంతనాలు జరిపారు. 
 
ఆ సమయంలో జకోవిచ్‌ వారిని ప్రాధేపడినట్లు దృశ్యాల్లో కనిపించింది. కొద్దిసేపటి తర్వాత జకోవిచ్‌ మ్యాచ్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఫ్రీమెల్‌ ప్రకటించాడు. దీనిపై స్పందించిన యూఎస్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌.. నిబంధనల ప్రకారమే ఫ్రీమెల్‌ జకోవిచ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించారని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments