Webdunia - Bharat's app for daily news and videos

Install App

#IPLSchedule వెల్లడి - ఆ జట్ల మధ్యే ప్రారంభ మ్యాచ్

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (17:24 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 పదమూడో సీజన్ పోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా జరుగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐపీఎల్ పాలక మండలి తాజాగా విడుదల చేసింది. సెప్టెంబరు 19న టోర్నీ ఆరంభంకానుండగా, నవంబరు 10న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
 
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు అబుదాబి ఆతిథ్యమివ్వనుంది. తదుపరి లీగ్ మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (సెప్టెంబరు 20), రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ (సెప్టెంబరు 21) ఆడతాయి. ప్రస్తుతానికి లీగ్ పోటీల షెడ్యూల్ మాత్రమే వెల్లడించారు. ప్లే ఆఫ్ పోటీల వేదికలు త్వరలో ప్రకటిస్తారు
 
కాగా, ఈ ఐపీల్‌ 13వ సీజన్ 46 రోజుల పాటు జరుగనుండగా, అబుదాబి, షార్జా, దుబాయి వేదికగా జరుగనున్నాయి. దుబాయిలో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్లే ఆఫ్‌, ఫైనల్‌ మ్యాచ్‌ వేదికలో త్వరలో ఖరారు చేయనున్నారు. రాత్రి 7.30 గంటలకు 46 మ్యాచ్‌లు జరుగుండగా, 10 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'దృశ్యం' మూవీ మర్డర్ సీన్ రిపీట్ - ప్రియుడు మోజులో భర్తను హత్య చేసి నడి ఇంటిలోనే పాతిపెట్టిన భార్య!

ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్ రాజీనామా వెనుక?

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేత

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments