ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 పదమూడో సీజన్ పోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా జరుగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐపీఎల్ పాలక మండలి తాజాగా విడుదల చేసింది. సెప్టెంబరు 19న టోర్నీ ఆరంభంకానుండగా, నవంబరు 10న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు అబుదాబి ఆతిథ్యమివ్వనుంది. తదుపరి లీగ్ మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (సెప్టెంబరు 20), రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ (సెప్టెంబరు 21) ఆడతాయి. ప్రస్తుతానికి లీగ్ పోటీల షెడ్యూల్ మాత్రమే వెల్లడించారు. ప్లే ఆఫ్ పోటీల వేదికలు త్వరలో ప్రకటిస్తారు
కాగా, ఈ ఐపీల్ 13వ సీజన్ 46 రోజుల పాటు జరుగనుండగా, అబుదాబి, షార్జా, దుబాయి వేదికగా జరుగనున్నాయి. దుబాయిలో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ వేదికలో త్వరలో ఖరారు చేయనున్నారు. రాత్రి 7.30 గంటలకు 46 మ్యాచ్‌లు జరుగుండగా, 10 మ్యాచ్‌లు జరుగనున్నాయి.