Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్ ఫోర్బ్స్ జాబితాలో ప.గో అమ్మాయి.. 75 దేశాలతో పోటీపడి...

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (13:40 IST)
ప్రతిష్టాత్మక మేగజైన్ ఫోర్బ్స్‌లో ఆంధ్రా అమ్మాయి మెరిసింది. అమెరికన్ ఫోర్బ్స్ మేగజైన్‌ అండర్ -30 శాస్త్రవేత్త విభాగంలో ఆమెకు చోటుదక్కింది. ఆ అమ్మాయి పేరు మేఘన. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. నవంబరు నెలలో ప్రచురించిన ఫోర్బ్స్ మేగజైన్‌లో ఆమె ఈ ఘనతను సాధించింది. 
 
గత 2018 మే నెలలో ఐసెఫ్ (ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్టు) అవార్డును ఆమె దక్కించుకున్నారు. దీంతో అత్యంత ప్రతిభాశాలిగా మేఘనను గుర్తించారు. ఇందుకోసం ఆమె ఏకంగా 75 దేశాలతో పోటీపడి గెలిచింది. ఈ మేగజైన్‌లో చోటు సంపాదించడంతో అటు అమెరికాలో, భారత్‌లో అభినందలు వెల్లువెత్తుతున్నాయి. 
 
కాగా, మేఘన తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని ఆర్క్‌నెస్ స్టేట్‌ లిటిల్ రాక్‌లో ఉంటున్నారు. సైన్స్ అంటే ఆసక్తి ఉండే మేఘన 2018లో ప్రపంచ స్ధాయిలో ఐసెఫ్ నిర్వహించిన సైన్స్‌ఫేర్ పోటీల్లో ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినమ్ అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొత్తం 75 దేశాల యువ శాస్త్రవేత్తలు పోటీపడ్డారు. ఈ పోటీల్లో ఆమె గెలుపొందడంతో ఆమెకు 50 వేల డాలర్లను బహుమతిగా అందజేశారు. ఫలితంగా ఆమెకు ఈ ఘనత దక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments