Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో ఘనంగా కార్తీక వనభోజనాలు(ఫోటోలు)

అమెరికాలో ఘనంగా కార్తీక వనభోజనాలు(ఫోటోలు)
, సోమవారం, 19 నవంబరు 2018 (19:36 IST)
కార్తీక వనభోజనాలు గుంటూరు ఎన్నారై అసోసియేషన్ ఆధ్వర్యలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్రిస్కో  ప్రొటెంమేయర్ షోన హుఫ్మం పాల్గొని మాట్లాడుతూ తెలుగువారు అమెరికా సమాజంలో కలసిపోయి అభివృద్ధిలో బాగస్వాములవుతూ సమాజ సేవ చేస్తున్నారని కొనియాడారు.
 
కార్యక్రమంలో ప్రసంగించిన పలువురు కార్తీక మాసంలో వనభోజనాల విశిష్టత, ఆచార వ్యవహారాలు, మన సంప్రదాయాలు, మన సాంప్రదాయ వంటలు మరియు ఆటలను పిల్లలకు తెలియజేసేలా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందరంగా ఉందన్నారు. దాదాపు 1600 మంది ప్రవాస గుంటూరు ఎన్నారైలు పాల్గొన్నఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు అమెరికా మరియు భారత జాతీయ గీతాలతో ప్రారంభమై.. మన సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ కార్యక్రమాలతో సూర్యాస్తమయం వరకు  కొనసాగించారు.
webdunia
 
వీటిలో ప్రధానంగా అతిథుల కొరకు రుచికరమైన 40 రకాల గుంటూరు సాంప్రదాయ వంటకాలు తయారుచేసి అందించారు. పిల్లలు, మహిళలు మరియు పురుషులు అందరికి వివిధ రకాలైన ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. స్థానిక పిల్లల పాటలు, డ్యాన్సులు, కోలాటం తదితర వినోద కార్యక్రమాలతో వనభోజనాలు ముగిసేవరకు కొనసాగించారు. బింగో, లక్కీ డ్రా తదితర ఆటలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు.
webdunia
 
ఈ కార్యక్రమం విజయవంతమవడానికి సహకరించిన చాట్ ఎన్ దోస రెస్టారెంట్, అరోమా, అమరావతి, ఆంధ్రా మెస్, బావార్చి, సెవెన్ స్పైసెస్, హరేలి గ్రోసరీస్, శ్రీకృష్ణ జ్యూయెలర్స్, ఉమెన్స్ డాట్ నెట్, బైట్ గ్రాఫ్ మరియు వారికి నిర్వాహకులు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియ చేసారు. 
webdunia
 
ఈ కార్యక్రమ పర్యవేక్షకులుగా శ్రీనివాసరావు కొమ్మినేని, మురళి వెన్నం, శివ జాస్తి, పుల్లారావు మందడపు, ప్రవీణ్ కోడలి, శ్రీనివాస్ శాఖమూరి, నవీన్ యర్రమనేని, చిన్నపు రెడ్డి అల్లం, జగదీశ్ నల్లమోతు, చల్ల కొండ్రగుంట, శ్రీనివాస్ యలవర్తి, దీప్తి సూర్యదేవర, అను అడుసుమిల్లి, శ్రావణి, లక్ష్మి యలవర్తి, అనిల్ కుర్ర, పూర్ణ పురుగుళ్ళ, వెంకట్ తొట్టెంపూడి, సురేష్ గూడూరు, రవి కోటపాటి, వెంకట్ యలవర్తి, మహేష్ గోగినేని, చిరంజీవి కనగాల, నవీన్ సాంబ, రాజేంద్ర, ప్రేమ్, ప్రతాప్ రెడ్డి, పూర్ణ యలవర్తి, రంగ పెమ్మసాని తదితరులు వున్నారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎత్తు పెరగడానికి 6 చిట్కాలు... ఏంటవి?