అగ్రరాజ్యం అమెరికాను భారత్ కిందికి నెట్టేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారత్ రెండోస్థానానికి ఎగబాకింది. 2018 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ అమెరికాను కిందికి నెట్టేసినట్టు మార్కెట్ రీసెర్చ్ సంస్థ కనాలిస్ తాజా నివేదిక వెలువరించింది.
మూడో త్రైమాసికంలో భారత్ 4 కోట్లకు పైగా యూనిట్లను రవాణా చేయగా... చైనా 10 కోట్లకు పైగా యూనిట్లను ఎగుమతి చేసి తొలిస్థానంలో నిలిచింది. 'ఈ త్రైమాసికంలో భారత్ అమెరికాను కిందికి నెట్టి రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు దేశాల్లోనూ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ భారత్ రెండో స్థానంలో నిలిచింది' అని ఆ తాజా నివేదిక పేర్కొంది.