Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ గ్రామంలో నైటీలు ధరించడం నిషేధం.. ఎందుకో తెలుసా?

ఆ గ్రామంలో నైటీలు ధరించడం నిషేధం.. ఎందుకో తెలుసా?
, శుక్రవారం, 9 నవంబరు 2018 (11:28 IST)
వెస్ట్ గోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లిలో మహిళలు ధరించే నైటీలు నిషేధం. ఎవరైనా మహిళలు నైటీలు ధరిస్తే అపరాధం చెల్లించాల్సిందే. నైటీలు ధరించి రోడ్లపైకి వస్తే.. రెండు రూ.వేలు జరిమానా, చూసినవారు చెబితే రూ.1000 బహుమతి అని ప్రకటించారు. దీన్ని అతిక్రమిస్తే గ్రామం నుంచి వెలివేయడం జరుగుతుందని గ్రామ పెద్దల కమిటీ నిర్ణయించినట్లు ఆ సోషల్‌ మీడియా పోస్టు సారాంశం. 
 
ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నైటీలు ధరించి రోడ్లపైకి వస్తే.. రూ.2000 జరిమానా, చూసినవారు చెబితే రూ.1000 బహుమతి అని ప్రకటించారు. దీన్ని అతిక్రమిస్తే గ్రామం నుంచి వెలివేయడం జరుగుతుందని గ్రామ పెద్దల కమిటీ నిర్ణయించినట్లు ఆ సోషల్‌ మీడియా పోస్టు సారాంశం.
 
20-35 ఏళ్ల మహిళలు నైటీలతోనే తమ పిల్లలను స్కూల్లో దింపటం, పాఠశాల బస్సులు ఎక్కించటం, కిరాణా దుకాణాలకు వెళ్లడం, ఎస్‌ఎంసీ, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు, డ్వాక్రా సమావేశాల్లో పాల్గొనటంతో పెద్దల్లో ఊరి ఆచారాలు, కట్టుబాట్లపై ఆందోళన నెలకొంది. పగటిపూట నైటీలతో సంచరించడం వల్ల కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. 
 
నైటీలతో బయటకు వెళ్లద్దని భర్త భార్యను వారిస్తుంటే.. ఊరంతా వేసుకుంటే లేనిది నేను వేసుకుంటే తప్పేమిటంటూ వాదించటంతో గొడవలు జరుగుతున్నాయి. యువకులతోనూ కొన్నిరకాల సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం మహిళలంతా గ్రామ పెద్దలతో కలిసి దీనిపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ నైటీలతో సంచరించరాదని నిషేధం విధించారు. మైకుల్లో ప్రచారం చేశారు. అతిక్రమిస్తే జరిమానాకు సిద్ధమవ్వాలని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యపై ఇద్దరితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన మాజీ భర్త