Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీ .. ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకుంటుంది?

స్త్రీ .. ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకుంటుంది?
, గురువారం, 8 నవంబరు 2018 (13:27 IST)
కుటుంబ వ్యవస్థకు మూలాధారం వివాహం. అందుకే పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు. భారతీయ వివాహ బంధానికి ప్రపంచమే తలవంచుతుంది. సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కుటుంబ జీవనంపై ఉన్న గౌరవం, సామాజిక అంశాలు ఇందుకు కారణం. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి అంటే ఈసడించుకునే పరిస్థితి పోయి ఇప్పుడు మనం కూడా అదేదారిలో నడిచేందుకు ఇష్టపడుతున్నామన్న భావన క్రమేపీ బలపడుతోంది.
 
పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకునే ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్న ఈ తరం దంపతుల పోకడ పాతతరం వారికి ఆందోళనకు కారణమవుతోంది. అదేసమయంలో కొందరు మహిళలు పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కూడా పెళ్లి పెటాకులవడానికి ఓ కారణంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా కొందరు మహిళలు భర్త ఉండగా, పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికిగల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
 
దంపతుల్లో చాలామందికి ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకునే బలహీనత ఉంటుంది. తాను ఆశించినట్టు భర్త లేడనో, సంసార సుఖం విషయాన్ని పట్టించుకోవడం లేదనో అసంతృప్తికి లోనవుతుంటారు. ఈ అసంతృప్తిలో వివాహేతర సంబంధాల ఉచ్చులో పడుతుంటారు. విషయం బయటపడ్డాక కాపురాలు కూలుతుండటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వివాహేతర సంబంధాలు విభేదాలకు కారణమై చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిలోనూ ఈ సమస్య ఉండటం, అదీ పెళ్లయ్యాక గోల్డెన్‌ పీరియడ్‌గా చెప్పుకునే మూడేళ్లలోపే ఈ సమస్యలు రావడం గమనార్హం.
 
ఓ సర్వే ప్రకారం మన దేశంలో ఏటా విడాకులు తీసుకుంటున్న జంటలు 13 లక్షల 60 వేల మంది వరకు ఉన్నారని అంచనా. విడాకులు తీసుకుంటున్న వారిలో విడిగా ఉండేందుకు ఇష్టపడుతున్న మహిళల సంఖ్య అధికం. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. మిజోరాంలో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి. అలాగే కులాంతర వివాహాలు అక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా ఒంటరిగా ఉండే మహిళలు కూడా పరాయి పురుషుని సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శెనగపిండి పేస్ట్ నుదిటిపై రాస్తే..?