శెనగపిండి ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. శెనగపిండితో పలురకాల పిండి వంటకాలు తయారుచేస్తుంటారు. కానీ వాటిని తినడానికి అంతగా ఇష్టపడరు. దీనిలోని పోషక విలువలు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. ప్రతిరోజూ శెనగపిండితో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో.. పరిశీలిద్దాం..
మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. రోజూ ఉదయాన్ని శెనగపిండిలో కొద్దిగా పాలు, చక్కెర కలిపి సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ పిండిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలానే గుండె సంబంధిత వ్యాధులను నుండి కాపాడుతుంది. గుండెపోటు గలవారు రోజూ శెనగపిండిలో చేసిన పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి.
తలనొప్పిగా ఉన్నప్పుడు శెనగపిండిలో కొద్దిగా నీరు పోసి పేస్ట్‌లా చేసి నుదిటిపై రాసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే నొప్పి తగ్గుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ పాలలో కొద్దిగా ఓట్స్, శెనగపిండి, చక్కెర, తేనె కలిపి ఇవ్వాలి. దాంతో చిన్నారులకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు రావు. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉన్నచో జ్వరం వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
శెనగపిండిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు మరే పిండి పదార్థాల్లో ఉండవు. కనుక శెనగపిండిని తరచుగా ఆహరంలో భాగంగా తీసుకుంటే మంచిది. అందానికి కూడా శెనగపిండితో ఇలా ప్యాక్ వేసుకోవచ్చు.. శెనగపిండిలో కొద్దిగా పసుపు, పాలు, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత శుభ్రం చేసుకుంటే.. ముడతల చర్మం రాదు.