స్వీటీ మళ్లీ వచ్చేస్తోంది. అదీ లేడీఓరియెంటెడ్ సినిమాలో అనుష్క అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. ''భాగమతి'' తర్వాత స్వీటీ అనుష్క వెండితెరపై తళుక్కుమనలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారట. పెళ్లి చేసుకుని అనుష్క సెటిల్ అయిపోతుందా.. సినిమాల్లో ఇక నటించదా అన్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తడంతో అనుష్క కొత్త సినిమాతో ముందుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
కొంతకాలంగా వెయిట్ లాస్‌పై ఫోకస్ పెట్టేందుకు విదేశాలకు వెళ్ళిన స్వీటీ త్వరలో భారత్‌కు రానుంది. అంతేగాకుండా ఓ తమిళ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారట. లేడీ ఓరియెంటెడ్ పాత్రలో ఇంతకు ముందు చేయని కొత్త పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. ఇందులో హీరో ఎవరు వంటి విషయాలు ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉంది.
ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించే 152వ సినిమాకు స్వీటీని హీరోయిన్‌గా సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది. మరి ఈ సినిమాల్లో అనుష్క నటిస్తున్న సంగతి నిజమో కాదో తెలియాలంటే.. అమ్మడు వచ్చేంతవరకు వేచి చూడాలి.