Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు పెళ్లేంటి? ఇటీవల విడాకులు కూడా అయ్యాయి: జ్యోతి

Advertiesment
నాకు పెళ్లేంటి? ఇటీవల విడాకులు కూడా అయ్యాయి: జ్యోతి
, మంగళవారం, 6 నవంబరు 2018 (12:48 IST)
ఆలీతో సరదాగా కార్యక్రమంలో సినీ నటి జ్యోతి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తెలుగు తెరపై విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతి.. ఈవీవీగారితో తనకు ఏర్పడిన వివాదం గురించి చెప్పుకొచ్చింది.


ఈవీవీ గారు గతంలో తనకు మంచి పాత్రలే ఇచ్చారు. అలాగే 'కితకితలు' సినిమాలో వేషం ఉందని చెబితే మంచి పాత్రే ఇస్తారు గదా అని వెళ్లాను. కానీ అదో వ్యాంప్ తరహా రోల్. లొకేషన్‌కి వెళ్లిన తర్వాత తనకు ఆ విషయం అర్థమైందని తెలిపింది. అక్కడున్న వాళ్లంతా తాను ఆ పాత్ర ఒప్పుకోవడంతో షాక్ అయ్యారు. 
 
కానీ తనకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ తర్వాత ఆ పాత్రను కాస్త మార్చమని ఈవీవీ గారిని అడిగాను. ఏంటి నేను చెప్తే చేయవా అని అన్నారు. ఈ విషయంలోనే ఆయన సీరియస్ అయ్యారు. 'నాకు ఇబ్బందిని కలిగించేది నేను చేయను సార్' అంటూ షూటింగ్ స్పాట్ నుంచి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. అలా అప్పటి నుంచి ఈవీవీగారితో దూరం పెరిగిందని వెల్లడించింది. 
 
వచ్చేవారం ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్, లేడీ కమెడియన్ గీతా సింగ్, అలానే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న జ్యోతి రాబోతున్న సందర్భంగా, దాని తాలుకు ప్రోమోని యూట్యూబ్‌లో విడుదల చేశారు. 
 
ఈ ప్రోమోలో గీత సింగ్ పెళ్లి, పీటలవరకు వెళ్లి ఆగిపోయిన విషయాన్నీ అలీ అడగడంతో, ''నన్ను పెళ్లిచేసుకున్న తరువాత నా కుటుంబాన్ని, అన్నయ్యను వదిలి రమ్మన్నారు, ఒకవేళ పెళ్లి తరువాత నా భర్త చనిపోతే అన్నయ్య నాకు తోడునీడగా నిలవరా అని వారికి సమాధానం ఇచ్చి, పెళ్లి కాదనుకుని వచ్చేసాను'' అని చెపుతుంది. 
 
ఇక జ్యోతికి పెళ్లి అయిందా అని అడగ్గా అయింది, కానీ నాకు ఇటీవల భర్త నుండి విడాకులు కూడా అయ్యాయి అని చెప్పడంతో షోలోని వారందరూ కొంత నిశ్శబ్దం వహిస్తారు. అయితే ఒకానొక సమయంలో మా బిడ్డను పలకరించడానికి కూడా ఇబ్బందిపడ్డ నా భర్తను చూసి తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. ఇక ఈ విధంగా నవ్వులు, బాధల మిళితంగా ఈ ప్రోమో సాగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన కోసం.. జబర్దస్త్‌ను వదులుకున్నాడా?