Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో నిధుల లేమి.. తాలిబన్ల హెచ్చరిక

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (11:02 IST)
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్‌లు ఆక్రమించుకున్నాక ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశం నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఆగిపోయాయి. దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా వేధిస్తుంది. 
 
శీతాకాలంలో ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆహారం, ఉద్యోగ సమస్యలు తీవ్రంగా ఉండటంతో ఆఫ్ఘన్ నుంచి ప్రజలు వలస వెళ్తున్నారు. శీతాకాలంలో ఈ వలసలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. దీంతో తాలిబన్ నేతలు ప్రపంచానికి హెచ్చరికలు చేస్తున్నారు.
 
తమకు రావాల్సిన 9 బిలియన్ డాలర్ల నిధులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసలు పెరిగే అవకాశం ఉంటుందని, వలసలతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని తాలిబన్ నేతలు హెచ్చరించారు. అమెరికా తమ సెంట్రల్ బ్యాంక్ నిధులను, ఆస్తులను స్తంభింపజేయడం ఆశ్చర్యంగా ఉందని, దోహ ఒప్పందానికి విరుద్దంగా అమెరికా ప్రవర్తిస్తోందని తాలిబన్ నేతలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments