అమెరికాలో ఘాతుకం: నల్లగొండ టెక్కీని కాల్చి చంపేశారు..

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (12:07 IST)
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. మేరీలాండ్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ పట్టణానికి చెందిన నక్కా సాయి చరణ్ మేరీలాండ్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 
 
ఆదివారం సాయి చరణ్ తన స్నేహితులను ఎయిర్ పోర్ట్‌లో డ్రాప్ చేసి కారులో తిరిగి వెళుతుండగా ఈ ఘాతుకం జరిగింది. కారును ఆపిన నల్ల జాతీయులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో సాయి చరణ్ స్పాట్ లోనే చనిపోయారు. సాయి కుమార్ మృతితో  అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
 
అమెరికాలో  ఎమ్మెస్ పూర్తిచేసిన సాయి చరణ్... ఆరు నెలల క్రితమే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగ చేస్తున్నారు. 
 
సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాకా ఇంటికి రాలేదు. సెప్టెంబర్ లోనే ఇండియాకు రావాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో నల్లజాతీయుల చేతిలో చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments