Publish Date: Fri, 17 Jun 2022 (10:19 IST)
Updated Date: Fri, 17 Jun 2022 (10:21 IST)
ప్రేమలో విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లె గ్రామానికి చెందిన ఓదేలు కుమారుడు నారుకట్ల రమేష్(26) సాఫ్ట్‌వేర్ ఇంజినీరు.
ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్నాడు. అతడితో పాటే చదువుకున్న యువతితో 11 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు.
కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై గురువారం మధ్యాహ్నం ఘట్‌కేసర్-చర్లపల్లి స్టేషన్ల మధ్య సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తింపు కార్డు ఆధారంగా రమేష్‌గా గుర్తించారు.
ప్రేమ విఫలమైనందుకే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.