హైదరాబాదులో గంజాయి అక్రమ రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా సోషల్ మీడియాను గంజాయి విక్రయానికి వేదికగా మార్చేశారు. యువత ఎక్కువగా గడిపే ఇన్ స్టాగ్రామ్ ద్వారా గంజాయిని విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాదులో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాదుకు చెందిన ఒమర్ ఖాన్ ఇంటర్ చదివే సమయంలో మధ్యలోనే ఆపేశాడు. అప్పటి నుంచి గంజాయిని అక్రం రవాణా చేస్తుండేవాడు. ఆదిలాబాద్ అడవుల్లో జశ్వంత్ అనే వ్యక్తి వద్ద గంజాయిని టోకుగా కొని హైదరాబాదులో విక్రయించే వాడు.
సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాపారం సాగించాడు. అయితే ఈ నెల 14న, 1,160 గ్రాముల గంజాయిని అమ్మేందుకు నాంపల్లికి వచ్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఒమర్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రెండు లక్షల రూపాయలు వుండవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు.