Megastar Chiranjeevi, Surekha blood donation
సాటి మనిషికి ఎన్ని దానాలు చేసినా అంతులో అత్యంత ముఖ్యమైనది రక్తదానమే అని మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. అందుకే తాను రక్తదాన శిబిరాన్ని ప్రారంభించానని తెలియజేస్తున్నారు. మంగళవారంనాడు రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ తాను, తన కుటుంబం రక్తదానంలో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు.
ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా మెగాస్టార్ చిరంజీవి రక్తదానాన్ని వదలలేదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ను స్థాపించి ఎంతోమందికి ఆసరాగా నిలిచారు. ఇతరుల ప్రాణాలను కాపాడడంలో రక్తదానం అత్యంత సులువైందిగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యదిక జనాభా గల దేశంలో మనది రెండో స్థానంలో వుంది. అందుకే నెంబర్ అయ్యేలా అత్యధిక రక్తదానాలు చేద్దాం. ఎంతో మంది ప్రాణాలను కాపాడుదాం అంటూ అభిమానులనుద్దేశించి పిలుపునిచ్చారు.