Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ కోసం స‌రికొత్త ప్ర‌ణాళిక‌

Advertiesment
Godfather poster
Godfather poster
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న కొత్త సినిమాల‌లో గాడ్ ఫాద‌ర్ ఒక‌టి. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి కొత్త వార్త‌ వినిపిస్తుంది. ఈ సినిమా గురించి ప్ర‌చారాన్ని స‌రికొత్త‌గా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆచార్య సినిమా త‌ర్వాత చిరంజీవి ఈ విష‌యంపై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిర్మాత‌లు కూడా అంగీక‌రించార‌ని తెలుస్తోంది. 
 
ఇది మ‌ల‌యాళ రీమేక్‌. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్ర చేస్తుండగా నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. స‌ల్మాన్ తెలుగులో న‌టించ‌డం విశేషం. అందుకే ప‌బ్లిసిటీని వినూత్నంగా చేయాల‌ని చూస్తున్నారు. ముందుముందు ప్ర‌తి అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. లేదంటే కొన్ని మాద్య‌మాలు ఇష్టంమొచ్చి రాస్తాయ‌నే అనుమానాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. క‌నుక‌నే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని రానున్న రోజుల్లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అది ఎలా అనేది త్వ‌ర‌లో తెలియ‌నుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లేచింది మహిళా లోకం సెట్లో శ్ర‌ద్దాదాస్ విన్యాసాలు వైర‌ల్‌