NTR 30th Movie promo still
ఎన్.టి.ఆర్. ట్రిబుల్ ఆర్. సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడనే ఆసక్తి వుంది. చిరంజీవితో ఆచార్య సినిమా చేసిన కొరటాల శివ డిజాస్టర్ సినిమాగా పేరుతెచ్చుకున్నాక కొరటాలతో ఎన్.టి.ఆర్. ప్రాజెక్ట్ లేదనే టాక్ ఒకటి వైరల్ అయింది. కానీ ఆచార్యకుముందే ఎన్.టి.ఆర్. 30వ సినిమా కమిట్ అయినట్లు అది సెట్‌పైకి వెల్ళనున్నట్లు మరో వార్త కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ సినిమా గురించి మరిన్ని వివరాలను తెలియజేసేలా చిత్ర యూనిట్ ఎన్.టి.ఆర్. చేతితో కత్తిపట్టుకున్న స్టిల్ విడుదలచేసింది. కేవలం చేయి, కత్తి మాత్రమే కనిపిస్తుంది.
రేపు అనగా మే20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్‌డేట్ రాబోతోంది. ఈ రోజు రాత్రి 7గంటల తర్వాత కొత్త విషయాలను తెలియజేయనున్నామని చిత్ర యూనిట్ సోషల్‌మీడియాలో తెలియజేసింది. ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా యువసుధ ఆర్ట్స్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యమైంది.