దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

ఠాగూర్
శుక్రవారం, 21 నవంబరు 2025 (18:00 IST)
దుబాయ్ ఎయిర్‌షోలో విషాదం చోటు చేసుకుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా.. తేజస్‌ ఒక్కసారిగా కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యుద్ధ విమాన పైలట్‌ ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన వెల్లడించింది.
 
'దుబాయ్‌ ఎయిర్‌షోలో తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్‌కు తీవ్ర గాయాలై మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్టసమయంలో పైలట్‌ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతాం' అని వాయుసేన తమ ప్రకటనలో తెలిపింది. యుద్ధ విమానం ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
 
నెగెటివ్‌ జీ-ఫోర్స్‌ టర్న్‌ నుంచి పైలట్‌ యుద్ధవిమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌ ఎయిర్‌షో ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ఈ ఎయిర్‌షోలో పాల్గొని సందడి చేస్తాయి. 
 
ఇక, ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసింది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 4.5వ తరం ఫైటర్‌జెట్‌. ప్రస్తుతం భారత వాయుసేనలో ఎంకే1 తేజస్‌ జెట్‌లు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో తేజస్‌ ఫైటర్‌ జెట్‌ శిక్షణ సార్టీలో ఉండగా.. కూలిపోయింది. ఆ ఘటనలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments