శుక్రవారం సాయంత్రం దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన విమాన ప్రదర్శన సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో ఫైటర్ జెట్ విమానం మధ్యలో దూసుకెళ్లి, అగ్నిగోళంగా పేలిపోవడం కనిపించింది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ వ్యాపించింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
దుబాయ్ వరల్డ్ సెంట్రల్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రేక్షకులు చూస్తుండగా నల్లటి పొగ వ్యాపించింది. ఈ క్రాష్ తర్వాత సైరన్లు మోగాయి. తేజస్ జెట్ పైలట్ ఈ ప్రమాదంలో మరణించాడు.
శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో వైమానిక ప్రదర్శన సందర్భంగా ఐఏఎఫ్ తేజస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణనష్టానికి ఐఏఎఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబానికి అండగా నిలుస్తోంది. ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి విచారణకు ఏర్పాటు చేశామని ఐఏఎఫ్ తెలిపింది.
తేజస్ అనేది భారత వైమానిక దళం కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన సింగిల్-ఇంజన్, మల్టీ-రోల్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. రేడియన్స్ అని అర్థం వచ్చే దీని పేరు 2003లో అధికారికంగా స్వీకరించబడింది.
తేజస్ అనేది భారతదేశంలోనే తయారు చేసిన తొలి దేశీయ యుద్ధ విమానం. అయితే విదేశీ ఇంజిన్ కూడా ఉంది. భారత వైమానిక దళం ప్రస్తుతం Mk1 రకం తేజస్ యుద్ధ జెట్‌ను నడుపుతోంది.