Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Advertiesment
sheika hasina

ఠాగూర్

, బుధవారం, 19 నవంబరు 2025 (13:23 IST)
భారత్ పెద్ద మనసు వల్లే తన తల్లి షేక్ హసీనా ఇంకా ప్రాణాలతో ఉన్నారని ఆమె కుమారుడు సాజిబ్వాజేద్ అన్నారు. ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యూనల్‌కు ఆమెకు మరణదండన విధించింది. దీనిపై హసీనా కుమారుడు స్పందిస్తూ, భారతదేశం వల్లే తన తల్లి ప్రాణాలు నిలిచాయన్నారు. తన తల్లిపై హత్యాయత్నాన్ని నిరోధించిన ఘనత భారతేనని వ్యాఖ్యానించారు. 
 
'భారత్ ఎల్లప్పుడూ మంచి మిత్రదేశంగా ఉంది. సంక్షోభ సమయంలో నా తల్లి ప్రాణాలు కాపాడింది. ఆమె బంగ్లాను వీడకపోయి ఉంటే.. మిలిటెంట్లు ఆమె హత్యకు కుట్రలు చేసేవారు. నా తల్లి ప్రాణాలు కాపాడినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని' అని సాజిబ్ పేర్కొన్నారు. 
 
కాగా, గత ఏడాది విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో తలదాచుకుంటుున్నారు. 
 
అయితే ఆమెపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం ఆమెను దోషిగా తేల్చి, మరణశిక్ష విధించింది. ఈ కేసుల విచారణలో భాగంగా బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పాటించలేదని సాజిబ్ విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు