Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు... 22 మంది మృత్యువాత

Advertiesment
gaza strip
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోమారు వైమానిక దాడులకు తెగబడింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళ గాజా స్ట్రిప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా డిఫెన్స్ ఏజెన్సీ అధికారికంగా వెల్లడించింది. 
 
గాజా అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. గాజా నగరంలో 12 మంది, ఖాన్ యూనిస్ ప్రాంతంలో మరో 10 మంది మరణించారు. ఈ మృతుల సంఖ్యను కూడా హమాస్ వర్గాలు కూడా ధృవీకరించాయి. 
 
అయితే, ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలిటరీ భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. తమ దేశంపై దాడి చేసేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు చేసినట్టు పేర్కొంది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు ఇజ్రాయేల్ సైన్యం స్పష్టం చేసింది. ఇరు వర్గాల పరస్పర ఆరోపణల నేపథ్యంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల జప్తు