ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

ఠాగూర్
సోమవారం, 16 జూన్ 2025 (13:39 IST)
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. దీంతో ఇరాన్ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, తమతమ గగనతలాన్ని మూసివేసింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తాజాగా మరోసారి స్పందించింది.
 
ఇజ్రాయెల్‌లో భారతీయులందరూ సురక్షితంగానే ఉన్నారని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. భారత పౌరుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంది. వారికి అవసరమైన సహాయం అందించేందుకు 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది.
 
ఇరాన్‌లో ఉంటున్న భారతీయ కుటుంబాలు, సంరక్షకులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులతో టెల్ అవీవ్‌లోని రాయబార కార్యాలయం నిరంతరం సంబంధాల్లో ఉందని తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.
 
ఇరాన్‌ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, గగనతలం మూసివేసినందున, భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని, స్థానిక అధికారులు సూచించే భద్రతా ప్రమాణాలు పాటించాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments