అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో ప్రవాస భారతీయుడు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (11:07 IST)
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠానికి వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని మరో ప్రవాస భారతీయుడు ప్రకటించారు. ఇంజనీర్ అయిన ఈయన పేరు హర్షవర్థన్ సింగ్. వచ్చే యేడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆయన అధికారికంగా ప్రకంటించారు. ఈ మేరకు ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద నమోదు చేయించుకున్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే ఇద్దరు భారతీయ అమెరికన్లు... నిక్కీ హేలీ(51), వివేక్‌ రామస్వామి(37) ఈ బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ముగ్గురు కూడా రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీకి దిగేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. 
 
ఈ పార్టీకే చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రిపబ్లికన్లలో తీవ్ర పోటీ నెలకొంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఎవరు ఉండాలో రిపబ్లికన్ల జాతీయ సదస్సు తేలుస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments