Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మతం మార్చుకుని.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న భారతీయ మహిళ అంజు

anju - pak lover
, బుధవారం, 26 జులై 2023 (12:35 IST)
ఇటీవల తన ఫేస్‌బుక్ ప్రియుడిని కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ మరో పెళ్లి చేసుకుంది. స్వదేశంలోని భర్తను, కన్న పిల్లలను కాదని పాక్ ప్రియుడిని వివాహం చేసుకుంది. ఇందుకోసం ఆమె ఏకంగా మతం మార్చుకున్నారు. హిందూ మతాన్ని త్యజించి, ఇస్లాం మతాన్ని స్వీకరించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఈ అనూహ్య పరిణామం సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన పాకిస్థాన్ ప్రియుడి కోసం రాజస్థాన్ మహిళ అంజూ (34) ఇటీవల పాకిస్థాన్‌కు వెళ్లింది. ఖైబరఖుంఖ్వా ప్రావిన్స్ అప్పర్ దిర్ జిల్లాలోని స్థానిక కోర్టులో అంజూ, ఆమె ప్రేమికుడు నస్రుల్లా (29) మంగళవారం వివాహం చేసుకున్నారని డీఐజీ స్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. 
 
'వివాహం ముందు అంజూ ఇస్లాం స్వీకరించి ఫాతిమాగా పేరు మార్చుకున్నారు. ఎవరి బలవంతం లేకుండా నిఖా చేసుకుంటున్నామని వధూవరులు అంగీకరించారు. బంధువులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసుల సమక్షంలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది' అని ఆయన వివరించారు.
 
వివాహం చేసుకోవడానికి ముందు సోమవారం అంజూ, నస్రుల్లాలు భారీ భద్రత నడుమ స్థానిక పర్యాటక ప్రాంతాల్లో విహరించారు. ఒక గార్డెన్‌లో వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఫొటోలు దిగారు. మరోవైపు తన పాక్ పర్యటన అకస్మాత్తుగా జరిగినది కాదని అంజూ (ఫాతిమా) చెప్పినట్లు పాక్ వార్తా సంస్థ జియో తన కథనంలో పేర్కొంది. కానీ, అక్కడకు వెళ్లిన తర్వాత అంతా తారుమారైపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జార్ఖండ్‌లో దారుణం : ప్రియుడి కళ్ళెదుటే మహిళపై అత్యాచారం