అండమాన్ నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లెయిర్‌కు సమీపంలో ఈ భూమి కంపించింది. భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప కేంద్రం పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయ దిశలో 126 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని తెలిపింది.