Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

ఠాగూర్
బుధవారం, 30 జులై 2025 (12:53 IST)
రష్యా తూర్పు తీరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. ఇది రిక్టర్ స్కేలుపై 8.8గా నమోదైంది. కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 8.8గా గుర్తించారు. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతో పాటు జపాన్, అమెరికా తీర ప్రాంతాలు సునామీ తాకిడికి గురయ్యాయి. 
 
ఈ భూకంపం ప్రభావం కారణంగా భారత్‌కు భారీ సునామీ ముప్పు పొంచివున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) స్పందించింది. భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పులేదని స్పష్టం చేసింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పులేదని తెలిపింది. ఈ మేరకు ఇన్‌కాయిస్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 
 
కంచట్కా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అనంతరం సునామీ తాకింది. అయితే, దీని కారణంగా భారత్‌కు సునామీ ముప్పులేదు. హిందూ మహాసముద్ర తీవ్ర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పులేదు. అని ఇన్‌కాయిస్ తన పోస్టులో పేర్కొంది. కాగా, ఈ భూకంపం తర్వాత రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాల్లో సునామీ అలల ప్రభావం కనిపించింది. అమెరికా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. హవాయి ద్వీపంలోనూ అలెర్ట్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments