Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో కొత్త ప్రధాన మంత్రి కోసం వెతుకులాట.. వారం రోజుల్లో తేలిపోతుంది..

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (10:29 IST)
Britan
బ్రిటన్‌లో కొత్త ప్రధాన మంత్రి కోసం వెతుకులాట ప్రారంభమైంది. ఇక వారం రోజుల్లో బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి ఎవరనేది తేలిపోతుంది. కొద్ది నెలల క్రితం బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రధానిని ఎన్నుకునే తతంగానికి రెండు నెలల సమయం పట్టింది. 
 
తాజాగా బ్రిటన్ ప్రధాని కోసం ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 650 సీట్లు గల బ్రిటిష్ పార్లమెంట్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ 357 మంది సభ్యులు వున్నారు. వారిలో ఎవరైనా సరే పార్టీ అధ్యక్ష పదవికీ, తద్వారా ప్రధాని పదవికీ పోటీపడవచ్చు. 
 
ఇంతకుముందు నామినేషన్ వేసేందుకు 20మంది ఎంపీల మద్దతు వుంటే సరిపోయేది. ఈసారి కనీసం 100 మంది కన్జర్వేటివ్ ఎంపీ మద్దతు ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హులని ప్రకటించారు. దీంతో ముగ్గురు నాయకులు మాత్రమే పార్టీ సారథ్యానికి పోటీపడగలుగుతారు. 
 
అక్టోబర్ 24 మధ్యాహ్నం 2 గంటలతో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల లోపల పార్టీ ఎంపీలు ఓటు వేస్తారు. 
 
ముగ్గురు అభ్యర్థులతో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో సాయంత్రం ఆరు గంటలకు ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి పోటీ నుంచి తప్పకోవాల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments