Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా

Liz Truss
, గురువారం, 20 అక్టోబరు 2022 (19:15 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. భారత సంతతికి చెందిన రిషి సునక్‌తో పోటీపడి విజయం సాధించిన రిషి సునక్ ఇటీవలే దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కేవలం 45 రోజుల పాటు ఆమె దేశ ప్రధానిగా కొనసాగారు. అయితే, ఆమె సారథ్యంలోని సర్కారు ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏకంగా ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. దీంతో పలువురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. దీంతో ఆమె తన పదవిని త్యజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా బ్రిటన్‌లో మరోమారు రాజకీయ సంక్షోభం ఉత్పన్నమైంది. 
 
గతంలో దేశ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్... దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని అదుపుచేయలేక పోయారు. ఫలితంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్‌తో పోటీ పడి మరీ లిజ్ ట్రస్ విజయం సాధించారు. 
 
ఆపై మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ట్రస్ పాలనను గాడిలో పెట్టే దిశగా కాస్తంత దూకుడుగానే సాగారు. ఈ క్రమంలోనే ఆమె ప్రభుత్వం ఇటీవలే మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మినీ బడ్జెట్‌పై విమర్శలు చెలరేగడం, అందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ట్రస్ ప్రకటన విడుదల చేయం వెంటవెంటనే జరిగిపోయాయి. 
 
అదేసమయంలో దేశంలో ఆర్థిక సంక్షోభం మరోమారు పురివిప్పింది. ఫలితంగా ట్రస్ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మంత్రులు రాజీనామాలు చేయడంతో విధి లేని పరిస్థితుల్లో ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధానిగా ట్రస్ కేవలం 45 రోజులు మాత్రమే కొనసాగారు. ఫలితంగా బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా ట్రస్ చెత్త రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మునుగోడు ఉపపోరు : బీజేపీ అభ్యర్థి తరపున జీవిత ప్రచారం