Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం - ప్రధానిగా రిషి సునాక్‌కు ఛాన్స్?

rishi sunak - lizz truss
, ఆదివారం, 16 అక్టోబరు 2022 (09:16 IST)
ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి జరిగిన ఎన్నికల్లో లిజ్ ట్రస్ విజయం సాధించారు. ఆమె ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇంతలో ఏమైందోగానీ, బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ప్రస్తుత ప్రధాని పదవి నుంచి లిజ్‌ ట్రస్‌ను దించేసి మాజీ మంత్రి రిషి సునాక్‌ను తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు బహిర్గతమైంది. ట్రస్‌ సారథ్యంలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారితీసింది. ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి.
 
ఈ ఊహించని పరిణామాలతో ఆర్థిక మంత్రి క్వాసీని పదవి నుంచి తప్పించి, ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను లిజ్‌ ట్రస్‌ నియమించిన విషయం తెలిసిందే. సంక్షోభ పరిస్థితులు అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పార్టీలో 62 శాతం మంది నేతలు తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలో ఉన్నట్లు 'ది టైమ్స్‌' నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. 
 
దీంతో రిషి సునాక్‌తో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థుల పరిశీలనను సైతం టోరీ సభ్యులు ప్రారంభించారని అందులో ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచిన పెన్నీ మోర్డాంట్‌ ఉన్నారని ఆ పోల్‌ వెల్లడించింది. యూకే చట్టాల ప్రకారం లిజ్‌ ట్రస్‌కు ఏడాదిపాటు పదవీ గండం ఉండదు. ఒకవేళ నిబంధనల్ని మారిస్తే మాత్రం ఆమెకు సవాల్‌ ఎదురుకావొచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో ఏపీ మంత్రులపై దాడులు.. హత్యాయత్నం కేసులు నమోదు