Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్.. కొత్త ప్రధానికి సంపూర్ణ మద్దతు : రిషి సునక్

rishi sunak - lizz truss
, సోమవారం, 5 సెప్టెంబరు 2022 (22:08 IST)
బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికై లిజ్ ట్రస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తానని ఆమె చేతిలో ఓడిపోయిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతూ వచ్చిన బ్రిటన్ ఎన్నిక ఫలితాలను సోమవారం సాయంత్రం 5 గంటలకు వెల్లడించారు. ఈ ఫలితాల్లో రిషి సునాక్‌పై లిజ్ ట్రస్ విజయభేరీ మోగించారు. 
 
ఈ ఫలితాల తర్వాత రిషి స్పందిస్తూ, ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌కు వెన్నంటే మనమంతా నిలుద్దామని అంటూ అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. 
 
ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న బ్రిటన్ పాలనా పగ్గాలు అందుకోబోతున్న లిజ్ ట్రస్‌కు అందరం ఐక్యంగా మద్దతు పలుకుదామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే ఖచ్చితంగా కొత్త ప్రధాని, కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు అందిస్తానని గతంలోనే రిషి సునాక్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ మాటలను ఆయన మరోమారు ఇపుడు గుర్తు చేశారు. 
 
కాగా, హోరాహోరీగా సాగిన బ్రిటన్ ఎన్నికల్లో 47 యేళ్ల లిజ్ ట్రస్‌కు 81,326 ఓట్లు లభించగా, రిషి సునాక్‌‍కు 60,399 ఓట్లు వచ్చాయి. కన్జర్వేటివ్ పార్టీలో మొత్తం 1,72,434 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. వీరిలో పోలింగ్ రోజున 82.6 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తం పోలైన ఓట్లలో 654 ఓట్లు చెల్లుబాటుకాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో భారీ భూకంపం - 30 మంది మృత్యువాత