Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్న జ్ఞాపకాలు ఇంకా అలానే నిలిచివున్నాయి : సీఎం జగన్

Advertiesment
ys rajasekhar reddy
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (10:14 IST)
సెప్టెంబరు రెండో తేదీ.. తన తండ్రి వైఎస్ఆర్ వర్థంతి. దీన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత, వైఎస్ఆర్ తనయుడైన వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. "నాన్న భౌతికంగా దూరమైనప్పటికీ ఆ జ్ఞాపకాలు అలానే నిలిచే ఉన్నాయని పేర్కొన్నారు. దేశ చరిత్రలో సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారంటూ ట్వీట్ చేశారు. 
 
"నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచివున్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వహించి, ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది" అని పేర్కొన్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెవి నొప్పి కోసం ఆస్పత్రిలో చేరితే చేయిని కోల్పోయిన యువతి.. ఎక్కడ?